10 వ తరగతి పరీక్షలకు సంబంధించి పిడుగురాళ్ల మండలంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందనీ మండల తహశీల్ధార్ కె. రవిబాబు విలేకరులకు తెలిపారు. 7 పరీక్షా కేంద్రాలలో మొత్తం 1800 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. అదే విధంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని పరీక్షా కేంద్రాలవద్ద త్రాగునీటి సౌకర్యంతో పాటు, ఆరోగ్య సిబ్బందిని కూడా కేటాయించినట్లు తహశీల్ధార్ తెలిపారు.ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షను విధించినట్లు తహశీల్ధార్ రవిబాబు విలేకరులకు తెలిపారు.