విజయవాడ:ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరణ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు అందజేశారు. ఆదరణ పథకానికి రూ.750 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2 లక్షల మందికి ఆధునిక పనిముట్లు అందజేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.