వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నగరపంచాయితి బిల్ కలెక్టర్, ఇంచార్జీ ఆర్ఐ గా పని చేస్తున్న మురళి ఓ వ్యక్తి నుండి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండ్ గా పట్టుబడ్డాడు....ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్ కోసం జడల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నర్సంపేట నగర పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు....అయితే ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా అధికారులు వెంకటేశ్వర్లుకు ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రం సర్టిఫికెట్ మంజూరు చేయకపోగా ఇంచార్జ్ ఆర్ ఐ మెరుగు మురళి రూ.10వేలు లంచం డిమాండ్ చేసాడు....దీంతో బాధితుడు వెంకటేశ్వర్లు ACB అధికారులను ఆశ్రయించాడు....ఏసీబీ అధికారులు వలపన్ని 10వేలు లంచం తీసుకుంటున్న మురళి ని పట్టుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు....ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.