జర్నలిస్టులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి ఇంటి ముందు మచ్చా రామలింగారెడ్డి కూర్చోని ధర్నా చేపట్టారు.. అనంత జర్నలిస్టులకు మూడు పడకల ఇల్లు నిర్మించాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ధర్నా.. ఆయన నివాసంలో ఆయనని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. APUWJ డిమాండ్లకు చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి స్పందిస్తూ.. జర్నలిస్టుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాము అన్నారు. ధర్నాలో ప్రభాకర్ నాయుడు, చౌడప్ప, లోకరాజు,జయరాం, విజయరాజు, ఆది, ఈశ్వర్, రామంజి, విషువర్ధన్ రెడ్డి, శ్రీరాములు, కుల్లాయప్ప, రమేష్, తదితరులు పాల్గొన్నారు..