పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కొందరు ఒక టీమ్ గా ఏర్పడి సెలెబ్రెటీ లను పరిచయం చేస్తామని చెప్పి కొంత మంది యువతులను పరిచయం చేసుకుని వారి వద్ద నుండి భారీగా బంగారం కాజేసిన 7 గురు యువకులను అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు. ఫేస్బుక్ లోని యువతులను ట్రాప్ చేసి వారిని మభ్య పెట్టి హీరోలను పరిచేయం చేస్తామని నమ్మిస్తారు. అనంతరం వారితో చాట్ చేసి అవి స్క్రీన్ షాట్స్ తీసి బెదిరింపులకు పాల్పడతారు. ఈ విధంగా ట్రాప్ లోకి దించిన వారినుండి బంగారం, డబ్బు వసూలు చేస్తారు. ఇలా చేసిన వారిలో జెనసేన పార్టీకి చెందిన బాలు, బాలాజీ అనే ఇరువురు యువకులు ఏ1, ఏ2 లుగా ఉన్నారు. వీరినుండి 3.5 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1.23 కోట్లు గా ఎస్పీ వెల్లడించారు. శుక్రవారంసాయంత్రం ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో జరిగినవిలేకరుల సమావేశం లో పూర్తి వివరాలు వెల్లడించిన పశ్చిమ ఎస్పీ రవి ప్రకాష్.