కర్నూల్ జిల్లా ఆదోని మండలం సంతకోడ్లూరు గ్రామం లో హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో మగవాళ్ళు చీర కట్టుకొని ముస్తాబవుతారు. మహిళ వేషధారణలో పురుషులు కుంభలతో శ్రీ రతి మన్మధుడి కి ప్రత్యేక పూజలు చేస్తారు. మగవారు తమ కోరికలు తీర్చుకొడానికి స్త్రీ వేష దారిణిలో ఆలయానికి వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు . ఇది ఆ నటి కాలం నుండి వస్తున్న ఆచారం . విద్యావంతుల సైతం తమ కోరికలు నెరవేర్చుకోనుటకు స్త్రీ వెళహదరణ తో వచ్చి రతి మన్మమధుల కు మొక్కుబడులు చెల్లించు కున్నారు.భక్తులు తమ గ్రామ సుభిక్షం కొరకు వ్యవసాయం,ఉద్యోగ,వివిధ రంగాల్లో తమ కోరికలు నెరవేరలంటే మగవారు ఆడ వేష దారణలో చీర కట్టాల్సిందే. భక్తులు తమ అనుకున్న కోరికలు తీరిన తర్వాత చీర కట్టక పోతే అనిష్టం కలుగుతుందని వారి నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎలాంటి సంఘటనలు జరగ కుండ పోలీసులు గట్టి బందోబస్త ఏర్పాటు చేశారు.