వంకాయ వంటి కూర... శంకరుడు వంటి దైవం లేడని అంటారు. నోరూరించే రుచితో పాటు అనేక వండర్‌ఫుల్ బెన్‌ఫిట్స్ వంకాయలో దాగి ఉన్నాయి. వంకాయను ఎగ్‌ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషకాలు, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వంకాయను వారంలో ఒక్కసారైనా డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది అని వైద్యులే చెబుతున్నారు. దీనికి కారణం వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ కారకాలతో పోరాడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఎంతో మేలును చేస్తుంది. వంకాయ శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ కె శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీస్ అస్సలు ఉండవు. అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారు తమ డైట్‌లో వంకాయను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి వంకాయ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్స్ మరియు ఎక్కువ ఫైబర్ ఉండటం వలన ఇది షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. అంతేకాకుండా వయసు పై బడే లక్షణాలను తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. నరాల వ్యాధులను దూరంగా ఉంచుతుంది. వంకాయ వాతాన్ని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. వంకాయ ఆకులకు నొప్పులను తగ్గించే గుణాలు ఉన్నాయి. వంకాయ ఆకుల రసానికి ఒక చెంచా తేనెను కలిపి రోజుకు మూడు సార్తు సేవించిన దగ్గు తగ్గుతుంది, కఫం పూర్తిగా పోతుంది. వంకాయ వాతం, బరువు పెరుగుతారు అని చాలా అపోహలున్నాయి. కానీ అది నిజం కాదు. జొన్నరొట్టె, సజ్జ రొట్టెతో కలిపి వంకాయను తింటే చాలా మంచిది. క్యాన్సర్‌ని అడ్డుకుంటుంది. ఇన్ని ఔషధాలున్న వంకాయను వారానికొక్కసారైనా తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...