07-12-2017, జమాతే ఇస్లామి హింద్ నంద్యాల శాఖా ఆధ్వర్యం లో శాంతి-సాఫల్యం కోసం ఇస్లాం ను తెలుసుకుందాం అనే నినాదం తో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్లాం పరిచయ కార్యక్రమం లో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన ఉద్యమ సాహిత్య ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద రెడ్డి మాత్ల్దదుతూ ఇస్లాం ధర్మం శాంతిని కోరుకుంటుంది అని , జమాతే ఇస్లామి హింద్ ఈ కార్యకం చేపట్టడం హర్శనియమన్నారు. జమాతే ఇస్లామి నంద్యాల శాఖా అధ్యక్షులు జక్రియ మాట్లాడుతూ ప్రజలందరికోసం ఇస్లాం పరిచయ కార్యక్రమమలు ప్రారంభించామన్నారు. ఇస్లాం పట్ల ప్రజల్లో సరైన అవగాహన సమాచారం లేకపోవడం వల్ల అపోహలు,అపార్థాలు,అనవసర భయాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. నేటి నుండి పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే తో పాటు మైనారిటీ నాయకులు సయ్యద్ సలాముల్ల , కన్వినర్ సైఫుల్లా,సభ్యులు మోమిన్ గౌస్, ముజాహిద్,సద్దాం,జామ,ఆబిద్,తదితరులు పాల్గొన్నారు.